'సిఎం బంధువులకు పవర్, పేదోడికి కొవ్వొత్తి'

కొండేపి (ప్రకాశం జిల్లా), 3 మార్చి 2013: ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి బంధుప్రీతితో వ్యవహరిస్తున్నారని, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకుడు జూపూడి ప్రభాకర్‌రావు ఆరోపించారు. 'తన బంధువుల ఇంటికి విద్యుత్తు, పేదవాడి ఇంటికి కొవ్వొత్తులు' అనే నినాదంతో సి.ఎం. కిరణ్‌ కుమార్‌రెడ్డి ఎన్నికలకు వెళ్లాలని జూపూడి ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా కొండేపిలో ఆదివారం జరిగిన వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జూపూడి ‌మాట్లాడారు.
Back to Top