ముందు మీరు ఆధారాలు చూపించండి

హైదరాబాద్)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు చేస్తున్న ఆరోపణలకు ముందు తమకు
ఆధారాలు చూపించాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్
చేశారు. ఆధారాలు చూపించకుండా తమ మీద బురద జల్లించటం ఎంత వరకు సబబని ఆయన సూటిగా
నిలదీశారు. అసెంబ్లీలో ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం మీద చర్చ లో పాల్గొంటూ ప్రభుత్వ
తీరుని నిలదీశారు.  

న్యాయస్థానాలు
ఎక్కడ తనను దోషిగా నిర్ధారించలేదని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అది న్యాయస్థానాల
విచారణలో ఉన్న విషయాల మీద పదే పదే మాట్లాడటం ఎంత వరకు సబబు అని మండిపడ్డారు. పదే
పదే రూ. 43వేల కోట్లు అంటున్నారని, అందులో పావలా వంతు ఇస్తే మిగిలినదంతా తమకు
ఇచ్చేస్తామని, కావాల్సిన చోట్ల సంతకం పెడతానని చెబుతున్నానని వైఎస్ జగన్ అన్నారు. నామీద
కేసులు ఎప్పుడు పెట్టారు, కాంగ్రెస్ లో ఉన్నంతకాలం ఏమీ పెట్టలేదని, కానీ,
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక మాత్రం కాంగ్రెస్, టీడీపీ కలిసి కేసులు పెట్టాయని
వైఎస్ జగన్ వివరించారు. తనమీద చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించి మాట్లాడాలని సవాల్
విసిరారు.

మరో వైపు,
బ్లాక్ మనీ తో రూ. 20 కోట్లు వెచ్చించి ఓటుకి కోట్లు చెల్లిస్తూ ఆడియో, వీడియో
టేపులతో సహా దొరికి పోయిన ముఖ్యమంత్రి ఇక్కడ నీతులు చెబుతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు.
ఈలోగా స్పీకర్ ఎప్పటిలాగే మైక్ కట్ చేయించి ప్రభుత్వ పక్షానికి మైక్ ఇచ్చారు. 

తాజా ఫోటోలు

Back to Top