పార్టీ బ‌లోపేతానికి కృషి

ప్ర‌కాశం:  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతానికి ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని పార్టీ ప్ర‌కాశం జిల్లా  అధ్య‌క్షుడు బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలు న‌గ‌రంలోని పార్టీ కార్యాల‌యంలో సోమ‌వారం జిల్లాలోని సంత‌నూత‌ల‌పాడు నియోజ‌క‌వ‌ర్గ పార్టీ శ్రేణుల విస్తృత స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సంత‌నూత‌ల‌పాడు వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఇటీవ‌ల నియ‌మితులైన సామాన్య కిర‌ణ్‌ను పార్టీ శ్రేణుల‌కు బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి ప‌రిచ‌యం చేశారు. అంద‌రూ ఐక‌మ‌త్యంగా ప‌నిచేసి 2019 ఎన్నిక‌ల్లో మ‌రోమారు నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ జెండాను రెప‌రెప‌లాడించాల‌ని బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి సూచించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌న స‌త్తా చూపించి, రాష్ట్రానికి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసుకుందామ‌ని, రాజ‌న్న రాజ్యాన్ని మ‌ళ్లీ తెచ్చుకుందామ‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. స‌మావేశంలో సంత‌నూత‌ల‌పాడు ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌, మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లి సుబ్బారెడ్డి, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.
Back to Top