న్యూఢిల్లీ))
వైయస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి
రాజ్యసభలో జిఎస్టీ బిల్ పై తన గళం వినిపించారు. జీఎస్టీ బిల్ పై జరిగిన చర్చలో
ఆయన మాట్లాడారు. జిఎస్టీ బిల్ సవరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు జరిగే నష్టాలను
ఆయన క్షుణ్ణంగా వివరించారు. సవరణ బిల్లులో కొన్ని సూచనలు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రికి ఆయన
విన్నవించారు. జీఎస్టీ నష్టాన్ని కేంద్రం భరిస్తుంది
అన్నారు. కానీ లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రానికి అధికంగా సాయం చెయ్యాల్సి
ఉంటుందని చెప్పారు. మొదటి 5సంవత్సరాలలో లోటు
శాతం విభజించిన తీరు సరికాదన్నారు. జీఎస్టీ ప్రకారం 3 సంవత్సరాలకు వందశాతం, తర్వాత సంవత్సరం
యాభైశాతం, చివరి సంవత్సరం
25 శాతం ఉంటుందన్నారు.
కానీ ఆంధ్రప్రదేశ్ కు 5 సంవత్సరాలు 100 శాతం, 6వ సంవత్సరం 50 శాతం, 7వ సంవత్సరం 25 శాతం ఉండాలని
ఆయన కోరారు. అంతేకాకుండా విభజన చట్టం ప్రకారం పన్ను మినహాయింపు అధిక శాతం అందాలని ఆయన కోరారు. ఆల్కహాల్, పెట్రోలియం
ఉత్పత్తులకు రాయితీ వర్తిస్తే విద్యుత్తుకు కూడా రాయితీ ఇవ్వాలన్నారు. ఇంటర్నెట్
వంటి సర్వీసులకు 40 శాతం మినహాయింపు పెంచాలని ఆయన కోరారు.