()నాడు రక్తం మరుగుతుందన్నాడు()నేడు ప్యాకేజీయే ముద్దంటున్నాడు()హోదా కోసం అందరం ఒక్కటై ఉద్యమిద్దాం()వైయస్సార్సీపీ నేతలు అంబటి, శ్రీనివాస్ రెడ్డి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తప్పని సరిగా ఇవ్వాల్సిందేనని వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి మోడీని చంద్రబాబు అడిగేటట్లు ఉద్యమవేడిని రగిలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో చైతన్యపథం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ప్రజలను వంచించిన తీరుపై ఉద్యమ హోరు జరుగుతుందన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జరుగుతున్న ఈ ఉద్యమానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, ఆందోళనలు చేసి సాధించుకున్న తెలంగాణను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని అంబటి కోరారు.
ఆనాడు నా రక్తం మరుగుతుందన్నారు.... నేడు ప్యాకేజీ చాలు అంటున్నారు. ఈ రెండిటి మధ్య ఏం జరిగిందో బాబు ప్రజలకు సమాధానం చెప్పాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు . చైతన్యపథం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ప్యాకేజీ పేరుతో బాబు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్యాకేజీ మంచిదంటూ చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత మొత్తం ప్రత్యేక హోదా కోరుతుంటే బాబు ప్యాకేజీ అనడంలో అంతర్యం ఏమిటని బాబును ప్రశ్నించారు. ఆనాడు బాబు ఇచ్చిన హామీనే నేడు ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. హిమచల్‌ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకముందు 23వేల ఉద్యోగాలు ఉంటే.... ప్రత్యేక హోదా వచ్చిన అనంతరం ప్రస్తుతం లక్ష 25వేలకు పైగా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. దీనిని బట్టి ప్రత్యేక హోదా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఒక్కసారి చంద్రబాబు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.