షిర్డీకి ఐదుగురి పయనం

పలాస: వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత వై.యస్.జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరవ్వాలని కోరుతూ పార్టీ యువజన విభాగం నాయకులు ఐదుగురు మంగళవారం షిర్డీ యాత్రకు బయలు దేరారు. షిర్డీలో బాబాకు ప్రత్యేక పూజలు చేయనున్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు. ఫలక్‌నుమా రైలులో బయలుదేరిన వీరికి పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ కణితి విశ్వనాథం పూలమాలలు వేసి వీడ్కోలు పలికారు. క్షేమంగా తిరిగిరావాలిన ఆకాంక్షించారు. షిర్డీ వెళ్లిన వారిలో యువజన విభాగం పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ కన్వీనర్ శార్వాణ రమేష్, బి.శంకరరావు, బి.మోహనరావు, హెచ్.కృష్ణారావు, వి.అనిల్‌కుమార్, పి.ఈశ్వరరావు ఉన్నారు.

Back to Top