షర్మిల యాత్రకు అద్భుత స్పందన

అలంపూర్:

నియోజకవర్గంలో జరిగిన షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు ప్రజల నుంచి విశేషస్పందన లభించిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి చెప్పారు.  సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో ఉహించని రీతిలో ప్రజామద్దతు లభించిందన్నారు. లక్ష మందితో స్వాగతం పలకాలని ముందుగా తీర్మానించుకున్న ప్రజలు స్వచ్ఛందంగా రెట్టింపు స్థాయిలో తరలి వచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిరుపేదలకు అందించిన పాలనను ఈ జనసందోహాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోయాయయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అనునిత్యం పరితపించిన ఆ మహానేత కుటుంబంపై కాంగ్రెస్, టీడీపీలు విషం కక్కుతున్నాయన్నారు. ప్రజావిశ్వాసం కోల్పోయిన ఆ రెండు పార్టీలు జగన్మోహన్‌ రెడ్డిపై ఎన్ని కుట్రలు పన్నినా ఫలించవన్నారు. జగన్ సారథ్యంలో రాజన్నరాజ్యం స్థాపన తథ్యమన్నారు.

Back to Top