'షర్మిలపై దాడి వార్త అవాస్తవం'

హైదరాబాద్ 08 మార్చి 2013:

  గుంటూరు జిల్లాలో శ్రీమతి వైయస్ షర్మిలపై ఒక తాగుబోతు మద్యం మత్తులో రాయి విసిరినట్లు, అది ఆమెను గాయపరిచినట్లూ  ఓ పత్రికలో వచ్చిన వార్త అవాస్తవం.  వాస్తవానికి అలాంటి  సంఘటనే జరగలేదు. ఇది కేవలం దుష్ప్రచారం మాత్రమే, దీనిని ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదు. పార్టీ కార్యకర్తలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. శ్రీమతి షర్మిల ప్రస్తుతం మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర గుంటూరు జిల్లాలో అప్రతిహతంగా సాగుతోంది.

Back to Top