షర్మిల పాదయాత్రలో ప్రముఖులు

జూలకల్ 19 నవంబర్ 2012 : 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర లో పలువురు నాయకులు పాల్గొంటున్నారు. ఆదివారం సాగిన 17 కిలోమీటర్ల పాదయాత్రలో వైయస్ఆర్ సీపీ సీనియర్ నాయకుడు ఎం.వి. మైసూరా రెడ్డి, పార్టీ శాసనసభాపక్షం ఉపనేత శోభా నాగిరెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, మాజీ మంత్రి జ్యోతుల నెహ్రూ తదితర ముఖ్యనేతలు కూడా పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కంపాడు నుంచి బయలుదేరిన షర్మిల సి.బెళగల్, పోలకల్‌లలో జరిగిన సభల్లో ప్రసంగించారు. దారిలో కనిపించిన ఉల్లి రైతులు తమ బాధలు చెప్పుకోగా వారిని ఓదార్చారు.  షర్మిలకు కూలీలు, విద్యార్థులు కూడా తమ సమస్యలు చెప్పుకున్నారు. జగననన్నకు అండగా నిలిచి సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని, అలా మళ్లీ 'రాజన్న రాజ్యం' తెచ్చుకోవాలనీ ఆమె కోరారు. రాత్రి షర్మిల జూలకల్ శివార్లలో బస చేశారు. ఈ పాదయాత్రలో పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి. మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, కొత్తకోట ప్రకాశ్ రెడ్డి, కోట్ల హరిచక్రపాణి రెడ్డి, ఇతర నియోజకవర్గాల నాయకులు ఎ.వి. సుబ్బారెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి,  బి.ఎన్.ఆర్. రాజు, సుదర్శనం, రాజా రత్నం, డాక్టర్ ఎ. మధుసూదన్, తెర్నెకల్ సురేందర్ రెడ్డి, నిడ్జూరి రాంభూపాల్ రెడ్డి, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర సాగిన మార్గంలో ప్రతిచోటా షర్మిలకు సాదర స్వాగతం లభించింది.

Back to Top