'షర్మిల పాదయాత్రకు తరలిరండి'

'షర్మిల పాదయాత్రకు తరలిరండి'
తిరుపతి: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 18వ తేదీ గురువారం ప్రారంభించే పాదయాత్రకు ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరావాలని పార్టీ జిల్లా కన్వీనర్ కె. నారాయణస్వామి, యువ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇడుపులపాయలో ప్రారంభమయ్యే పాదయాత్రకు జిల్లా నలుమూలల నుంచి అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నట్టు వారు చెప్పారు. ఎన్టీ రామారావు దయతో టీడీపీలో చేరిన చంద్రబాబు ఆయన్ను వెన్నుపోటు పొడిచి కుర్చీ లాగేసుకున్నారన్నారు. ఆ తర్వాత తొమ్మిదేళ్లు సీఎంగా పాలన సాగించిన చంద్రబాబు ఒక్కో పథకం రద్దు చేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడూ రైతులు, పేదల గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు అధికారం కోసం పాదయాత్ర చేస్తున్నారనే విషయం అందరికీ తెలుసన్నారు. పదవీ వ్యామోహంతో చంద్రబాబు ఇస్తున్న హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వల్ల రాజకీయ నిచ్చెనలెక్కిన అనేక మంది నేడు ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి చనిపోయినా, అన్న జైల్లో ఉన్నా ప్రజల కోసం వైయస్ కుమార్తె షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టడం ప్రజల పట్ల ఆ కుటుంబానికి ఉన్న నిబద్ధతను తెలియచేస్తోందన్నారు. 3వేల కిలోమీటర్లు షర్మిల పాదయాత్ర చేసి ప్రజల బాధలు ప్రత్యక్షంగా తెలుసుకుంటారన్నారు. పాదయాత్ర ప్రారంభ సభలో పాల్గొనడానికి జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల జిల్లా కన్వీనర్లు, మండల, పంచాయతీ కన్వీనర్లు, ముఖ్య నేతలు, వైఎస్ కుటుంబ అభిమానులందరూ ఇడుపులపాయకు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం
 వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇ న్‌చార్జి ఏయస్. మనోహర్ చెప్పారు. గడపగడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా నగరంలోని టాప్‌లైన్, అశోకపురం, లాలూ గార్డెన్ ప్రాంతాల్లో పార్టీ నేతలతో కలసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వం అవసరమని ప్రజలు భావిస్తున్నారని తెలిపా రు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఈ విషయం రుజువైందని చెప్పారు. మహానేత వైయస్. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాల అమలు ఒక్క జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని తెలిపారు. ప్రజాసమస్యలపై నిలదీయాల్సిన బాధ్యతాయుత ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. పాదయాత్ర పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నగర 

వైయస్‌ఆర్ కాంగ్రెస్‌తోనే రాష్ట్రాభివృద్ధి
రొద్దం: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పలువురు పార్టీ నాయకులు చెప్పారు. గోనిమేకులపల్లి ప్రాథమిక పాఠశాలలో గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు పెట్రోలు బంకు శివారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్.నరసింహులు, జీవీపీ నాయుడు, ఇప్పేటి ఆదినారాయణరెడ్డి, ఎల్‌ఐసీ రమణ, నాయకురాలు మాజీ ఎంపీ గంగాధర్ సతీమణి మంగమ్మ, మాజీ ఎమ్మెల్యే రమణరెడ్డి సోదరి సానే ఉషారాణి, తదితరులు మాట్లాడారు. వైయస్ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు చేరాలన్నా, వాటిని నిరంతరం కొనసాగించాలన్నా జననేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని వారు పిలుపునిచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఉన్నారని అధైర్య పడొద్దని, ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చే యాలని సూచించారు. అనంతరం టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ గ్రామంలో ఆ పార్టీకి చెందిన 67 కుటుంబాల వారు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, మరో 55 కుటుంబాల వారు నాయకుల సమక్షంలో వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. పెట్రోల్ బంక్ శివారెడ్డి వారందరికీ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ కాటిమ తిమ్మారెడ్డి, నియోజకవర్గ యువజన నాయకులు సుదర్శన్‌రెడ్డి, పెనుకొండ శ్రీరాములు, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, మండల యువజన విభాగం అధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి, బీసీ సెల్ మండల నాయకుడు దాసరి రామాంజినేయులు, ప్రధాన కార్యదర్శి గోవిందప్ప, మైనార్టీ నాయకుడు అమీర్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాల అమలు జగన్‌కే సాధ్యం
గుడుపల్లె: మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల అమలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమవుతుందని వైయస్ఆర్ సీపీ కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జి, జెడ్పీ వూజీ చైర్మన్ ఎం. సుబ్రమణ్యంరెడ్డి పేర్కొన్నారు. కవ్ముట్టపల్లె, గుండ్లసాగరం గ్రామాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సవూవేశాలు నిర్వహించారు. కవ్ముగుట్టపల్లె గ్రావుంలో వైయస్ఆర్ సేవా సంఘం ఏర్పాటు చేశారు. అనంతరం సాయుంత్రం గుండ్లసాగరం గ్రావుంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు వైయస్ రాజశేఖరరెడ్డి అండగా నిలిచారన్నారు. ఉన్నత చదువులు చదివేందుకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ను అమలుచేసి పేద విద్యార్థులకు చేయూతనిచ్చారని చెప్పారు. గుండ్లసాగరం గ్రావుంలోని 70 వుంది టీడీపీ కార్యకర్తలు సుబ్రమణ్యంరెడ్డి సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమలో స్థానిక ప్రముఖులు జంషద్‌బాషా, కన్నన్, చౌడప్ప, కృష్ణయ్యు, కృష్ణవుూర్తి, రాంబాబు, రమేష్, వూబూసాబ్, వెంకటేశు, చంద్రశేఖర్, పాచ్చావలి పాల్గొన్నారు.


తాజా వీడియోలు

Back to Top