షర్మిల పాదయాత్రకు నేడు విరామం

మహబూబ్‌నగర్, ‌9 డిసెంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు ఆదివారం విరామం ప్రకటించారు. అక్టోబర్‌ 18న వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించిన శ్రీమతి షర్మిల వరుసగా 52 రోజులుగా నడుస్తున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ ప్రజాప్రస్థానం చేస్తున్న శ్రీమతి షర్మిలకు ఆదివారం వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు. అందుకోసం పాదయాత్రకు ఒక రోజు విరామం ఇచ్చారు. హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రి వైద్యుల బృందం‌ శ్రీమతి షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించనుంది.

శనివారం రాత్రి మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని జహంగీర్ పీ‌ర్ దర్గా ‌(జెపి దర్గా) సమీపంలో శ్రీమతి షర్మిల బసచేశారు. ఆదివారం కూడా ఆమె జెపి దర్గా సమీపంలోని బసలోనే ఉంటారు. సోమవారం ఉదయం నుంచి శ్రీమతి షర్మిల పాదయాత్ర యథావిధిగా కొనసాగుతుంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top