షర్మిల నేటి పాదయాత్ర సాగుతుందిలా...

దేవరకద్ర (మహబూబ్‌నగర్) 3 డిసెంబర్ 2012  : 'మరో ప్రజా ప్రస్థానం' లో భాగంగా శ్రీమతి షర్మిల సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర శివారు ప్రాంతం నుంచి తన పాదయాత్రను ప్రారంభిస్తారు. మన్యంకొండ, ఓబులాయపల్లి, అప్పాయపల్లి, కోడూరు క్రాస్ రోడ్, రామిరెడ్డి గూడెం, బొక్కలోనిపల్లి, చౌదరిపల్లి గేట్, ధర్మాపురం గ్రామాల మీదుగా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి ధర్మాపురం గ్రామ శివారు ప్రాంతంలో షర్మిల బస చేస్తారు. సోమవారం షర్మిల16.1 కి.మీ. మేరకు పాదయాత్ర కొనసాగిస్తారు. పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి మీడియాకు ఈ వివరాలు తెలిపారు.  
Back to Top