షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా

గుంటూరు, 11 మార్చి 2013:

దివంగత మహానేత డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ  వైయస్. జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర సోమవారం చిలకలూరిపేట నియోజకవర్గంలో సాగనుందని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురామ్ తెలిపారు. బసచేసిన ప్రాంతం నుంచి సోమవారం ఉదయం బయలు దేరి తిమ్మాపురం మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం మైదవోలు, లింగారావుపాలెం మీదుగా రాత్రి బసకు చేరతారు.శివరాత్రిని పురస్కరించుకుని పోలీసులు చేసిన విజ్ఞప్తిమేరకు ఆమె ఆదివారం పాదయాత్రకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం 87వ రోజున ఆమె మొత్తం 12.4 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారు.

Back to Top