షర్మిల మరో ప్రజాప్రస్థానానికి ఒకరోజు విరామం

గుడివాడ (కృష్ణాజిల్లా), 7 ఏప్రిల్‌ 2013: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు ఈ నెల 8వ తేదీ ఒక్కరోజు విరామాన్ని ప్రకటించారు. పార్టీ గౌర‌వ అధ్యక్షురాలు, శ్రీమతి షర్మిల మాతృమూర్తి శ్రీమతి వైయస్ విజయమ్మ అమ్మమ్మ‌ శ్రీమతి సోమమ్మ (96) మృతి చెందడంతో పాదయాత్రకు ఒక రోజు విరామం ప్రకటించినట్లు పార్టీ కార్యక్రమాల కమిటీ సమన్వయకర్త తలశిల రఘురాం ఆదివారం ఇక్కడ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని జొన్నపాడులో పాదయాత్ర చేస్తుండగా శ్రీమతి సోమమ్మ మరణ వార్త తెలిసింది. దానితో శ్రీమతి షర్మిల బయలుదేరి కడప వెళ్ళారు. ఈ నెల 9 మంగళవారంనాడు శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని రఘురాం తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top