షర్మిలకు పార్టీ శ్రేణుల జన్మదిన శుభాకాంక్షలు

   
యాంజల్ (రంగారెడ్డి జిల్లా):

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల తన పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. మోకాలి గాయంతో బాధపడుతున్న శ్రీమతి షర్మిల రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని యాంజల్ గ్రామంలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. గాయం నుంచి శ్రీమతి షర్మిల త్వరగా కోలుకోవాలని కార్యకర్తలు ఆకాంక్షించారు.

     అక్టోబర్ 18న ఇడుపుల పాయలో శ్రీమతి షర్మిల చేపట్టిన 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, మహబూబ్ నగర్ జిల్లాల మీదుగా రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 24 నియోజక వర్గాల్లో 57 రోజులపాటు సాగిన శ్రీమతి షర్మిల పాదయాత్రలో 822 కిలో మీటర్లు నడిచారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top