షర్మిల 26వ రోజు పాదయాత్ర 13.6 కి.మీలు

ఆలూరు

12 నవంబర్ 2012 : 'మరో ప్రజాప్రస్థానం'లో భాగంగా షర్మిల 26 వ రోజు పాదయాత్ర సోమవారం 13.6 కిలోమీటర్ల మేర సాగుతుంది. ఆలూరు నియోజకవర్గం పరిధిలో మధ్యాహ్నం వరకు పాదయాత్ర కొనసాగి మధ్యాహ్న భోజన విరామానంతరం ఆదోని నియోజకవర్గంలోని విరుపాపురం గ్రామంలోకి ప్రవేశిస్తుంది. చిరుమానుదొడ్డి నుంచి ఉదయం ప్రారంభమయ్యే పాదయాత్ర హలిగేర, బెనిగేరి, నగరూరు క్రాస్, విరుపాపురం, సాదాపురం క్రాస్ మీదుగా దిబ్బనకల్లు క్రాస్ వరకు సాగుతుంది. వైయస్ఆర్ సీపీ ప్రోగ్రాం కన్వీనర్ టి. రఘురాం, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి మీడియాకు ఈ వివరాలు తెలిపారు. కాగా షర్మిల 25వ రోజు పాదయాత్రలో కర్నూలు జిల్లాలోని పత్తికొండ శివారు నుంచి ఆలూరు నియోజకవర్గం లోని చిరుమానుదొడ్డి వరకు మొత్తం 15.2 కి.మీల మేర పాదయాత్ర చేశారు.

Back to Top