జగన్మోహన్ రెడ్డిని కలిసిన షర్మిల

హైదరాబాద్ 17 సెప్టెంబర్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ  శ్రీమతి వైయస్ షర్మిల మంగళవారం చంచల్‌గుడా జైలుకు వెళ్ళి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.  సమైక్య శంఖారావం బస్సు యాత్రను ముగించుకున్న ఆమె మంగళవారం ఉదయం విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం జైల్లో జగన్ను కలిసి సమైక్య శంఖారావం బస్సు యాత్ర వివరాలు తెలిపినట్లు సమాచారం. శ్రీమతి షర్మిల చేపట్టిన  సమైక్య శంఖారావం బస్సు యాత్ర 14వరోజు సోమవారం శ్రీకాకుళం జిల్లాలో ముగిసింది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి బయలుదేరిన శ్రీమతి షర్మిల సీమాంధ్ర జిల్లాల్లో పర్యటించారు.

Back to Top