సేవా కార్యక్రమాలు అభినందనీయం

కె.కోటపాడు : తల్లిదండ్రులు వేచలపు సత్యం, నారాయణమ్మల ఆశయసాధన కోసం కుమారుడు దొరబాబు చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన లంకవానిపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కె.కోటపాడు సమితి ఉపాధ్యక్షుడు వేచలపు సత్యం సతీమణి నారాయణమ్మ సంతాప సభ సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నారాయణమ్మకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ముత్యాలనాయుడు మాట్లాడుతు తండ్రి సత్యం గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారని, ఆయన బాటలోనే వారి కుమారుడు దొరబాబు తన స్వంత నిధులతో గ్రామంలో బంగారమ్మ ఆలయంతో పాటు ఆధ్మాత్మిక కార్యక్రమాలను కోనసాగించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌.కోట వైఎస్సార్‌సిపి సమన్వయకర్త నెక్కళ్ల నాయుడుబాబు, మాజీ ఎమ్మెల్యే పూడి మంగపతిరావు, అవుగడ్డ రామ్మూర్తినాయుడు, సర్పంచ్‌ అవుగడ్డ సోంబాబు పాల్గొన్నారు.
Back to Top