<strong>తిరుపతి: </strong>చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి నగర ప్రజల పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొండి వైఖరి అవలంబిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి శుక్రవారం ఆరోపించారు. తిరుపతిలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందనీ, అయినా ముఖ్యమంత్రి ఈ సమస్యను ఎంత మాత్రం పట్టించుకోవడం లేదనీ ఆయన విమర్శించారు. ఉప ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సీఎం విస్మరించారని భూమన ఆరోపించారు. గాలేరు జలాలు తిరుపతి తెచ్చేందుకు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఎంతో కృషి చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. గాలేరు పథకాన్ని కిరణ్ సర్కారు తుంగలోకి తొక్కిందని మండిపడ్డారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయిన వెంటనే గాలేరు నీటిని తిరుపతికి తెప్పిస్తామని భూమన ప్రజలకు హామీ ఇచ్చారు.<br/>