ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడండి

నెల్లూరులోని 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇష్టారీతిగా రోడ్లను తవ్వేసి తాత్కాలికంగా పూడ్చేసి వెళ్లడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఎమ్మెల్యేలకు వివరించారు. గుంతలు పూడ్చే విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే సూచించారు. రోడ్లు తవ్విన ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top