స‌ర్వేప‌ల్లికి ఘ‌న నివాళి

హైద‌రాబాద్ః దేశ మాజీ రాష్ట్ర‌ప‌తి స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ జ‌యంతిని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్ సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాజ‌కీయ వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, అధికార ప్ర‌తినిధులు అంబ‌టి రాంబాబు, వాసిరెడ్డి ప‌ద్మ‌లు స‌ర్వేప‌ల్లి చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం తెలుగు రాష్ట్రాల ఉపాధ్యాయుల‌కు వారు టీచ‌ర్స్ డే శుభాకాంక్ష‌లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Back to Top