సర్వేపై వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మండిపాటు

హైదరాబాద్, 25 మార్చి 2013:

కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ దివంగత మహానేతపై డాక్టర్ వైయస్ఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. తక్షణం మహానేత కుటుంబానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దమ్ముంటే రాజీనామా చేసి సోనియా బొమ్మతో గెలవాలని వారు సర్వేను సవాలు చేశారు. తాము మహానేత బొమ్మతో పోటీ చేస్తామననీ, ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూస్తామనీ తెలిపారు. ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, సుచరిత, శ్రీనివాసులు మవిలేకరులతో మాట్లాడారు. మహానేత మరణంపై నీచంగా మాట్లాడటం తగదన్నారు. ఇందిర, రాజీవ్ గాంధీల హత్యలపై మాట్లాడటానికి తమకు సంస్కారం అడ్డొస్తోందన్నారు. నీకింకా పదవులు కావాలంటే సోనియా కాళ్ళు పట్టుకుని భజన చేసుకోవాలని సూచించారు. మహానేతను తక్కువ చేసి మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు సర్వేను హెచ్చరించారు.

Back to Top