వైయస్ఆర్‌ కాంగ్రెస్ ‌సర్పంచ్ విజేతలు

హైదరాబాద్‌, 27 జూలై 2013:

పంచాయతీ ఎన్నికల రెండవ విడత ఫలితాలలో కూడా వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మద్దతుదారులే అత్యధిక పంచాయతీలలో సర్పం‌చ్లుగా గెలిచారు. రెండవ విడత ఎన్నికైన కొందరు సర్పంచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

నెల్లూరు జిల్లా : దొంతాలి పంచాయతీ సర్పంచ్‌గా రత్నమ్మ, బుచ్చి మండలం పంచేడులో రమణమ్మ, వెంకటాచలం మండలం పాలిచర్లపాడు సర్పంచ్‌గా డి.సుబ్బయ్య ఎన్నికయ్యారు. అలాగే నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బత్తలపల్లి సర్పంచ్‌గా ప్రసాద్, వెల్లికంటిపాలెంలో సుధాకర్, వెంకటాచలం మండలం కందలపాడు సర్పంచ్‌గా వెంకమ్మ, విడవలూరు మండలం దండిగుంటలో కృష్ణమ్మ, ఇందుకూరిపేట మండలం ముదివర్తిపాలెం సర్పంచ్‌లో ఎం.రామయ్య, పల్లిపాడులో జయరామయ్య, కొత్తూరు మండలం చింతోపు సర్పంచ్‌గా కమలమ్మ ఎన్నికయ్యారు.

వైయస్‌ఆర్‌ జిల్లాలోని కాశీనాయన మండలం బాలాయపల్లి సర్పంచ్‌గా తిరుపాల్‌ ఎన్నికవగా రాజంపేట మండలం సీతారాంపురం సర్పంచ్‌గా లలితకుమారి, పుల్లంపేట మండలం వత్తులూరులో ఎం.రాజమ్మ, అనాసముద్రంలో ముద్దాపెద్ద విజయమ్మ విజయం సాధించారు. ఇదే జిల్లాలోని దారాలమడుగు సర్పంచ్‌గా పి.శోభ, రంగంపల్లి సర్పంచ్‌గా వై.పార్వతి, అనంతపల్లి సర్పంచ్‌గా కృష్ణారెడ్డి, తిప్పాయిపల్లికి రామసుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. అలాగే రాజంపేట మండలం ఆకేపాడు సర్పంచ్‌గా పి.గంగయ్య, సిద్ధవటం మండలం పేకరాజుపల్లిలో ఆవుల వెంకటరమణ గెలిచారు.

చిత్తూరు జిల్లాలోని నారాయణవనం సర్పంచ్‌గా కోనేటి సుధ ఎన్నికయ్యారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మర్రిపాక సర్పంచ్‌గా బండారు వరలక్ష్మి గెలిచారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం సర్పంచ్‌గా కనుమర్తి వేణుమాధవ్‌ విజయం సాధించారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం కేతవీరులపాడు సర్పంచ్‌గా ఎన్.శిరీష గెలవగా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం రుద్రారం‌లో లక్ష్మమ్మ గెలిచారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం లచ్చుగూడెం ‌సర్పంచ్‌గా బోగు యాదయ్య, కర్నూలు జిల్లా రుద్రవరం మండలం బీరవోలు సర్పంచ్‌గా లక్ష్మీకాంతుడు, గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామ సర్పంచ్‌గా గార్ల కుమారి విజయం సాధించారు.

మహబూబ్నగ‌ర్ జిల్లా కోయి‌ల్‌కొండ మండలం బూరుగుపల్లి సర్పంచ్‌గా దేవమ్మ, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ముదిగొండలో జక్కుల స్వరూప, ఉగ్గంపల్లిలో మంజుల గెలిచారు. చెన్నారావుపేట మండలం జల్లి నుంచి నూనె కొమురమ్మ, మగ్దూంపురంలో కొండేటి అరుణ, బ్రాహ్మణపల్లి లక్ష్మీపురం సర్పంచ్‌గా షఫీయుద్దీన్ విజయాలు సాధించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం దోమలడెగి ‌సర్పంచ్‌గా అనంత విఠల్, కొత్తపల్లిలో చాగం కళ్యాణి. విశాఖ జిల్లా చీడిగుమ్మల సర్పంచ్‌గా కృష్ణ గెలిచారు.

Back to Top