రాష్ట్రస్థాయి పతకం సాధించటం అబినందనీయం

విజయవాడ: పవర్‌ లిఫ్టింగ్‌లో రాష్ట్ర స్థాయి పతకం సాధించటం అబినందనీయమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను పేర్కొన్నారు. పట్టణానికి చెందిన అన్నేపల్లి శ్రీకాంత్‌ రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో 59 కేజీల విభాగంలో మొదటి స్థానం సాధించిన సందర్భంగా శనివారం ఆయన స్వగృహంలో అబినంధించారు. ఉదయభాను మాట్లాడుతూ ఇటువంటి పతకాలు మరిన్ని సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ చిలుకూరి శ్రీనివాసరావు, పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం కన్వీనర్‌ అన్నాబత్తుల శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు సుశీల, ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ ఇరుగు రవీంద్ర, జిల్లా యూత్‌ కార్యదర్శి మోరే వినోద్, నాయకుడు సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.  

Back to Top