'సమస్యలపై యువత పోరాడాలి'

కాకినాడ (తూర్పు గోదావరి జిల్లా):

రాష్ర్టంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై యువత పోరాడాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి పిలుపునిచ్చారు. నగర యువజన విభాగం అధ్యక్షుడు మల్లాడి రాజు రూపొందించిన ‘యువత రాజకీయ ప్రవేశం - రాష్ట్ర భవితకు అవశ్యం’ అనే కరపత్రాన్ని భూమా నాగిరెడ్డి స్థానిక రాయల్‌పార్క్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం ప్రతిస్పందిస్తూ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నెలాఖరు నాటికి సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తిచేయాలన్నారు.

     సహకార ఎన్నికల్లో పార్టీ విజయవకాశాలపై జిల్లా కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయితో పాటు పలువురు ముఖ్య నేతలను భూమా నాగిరెడ్డి ఆరా తీశారు. రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించిన ఆయన పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. డీసీసీబీని కైవసం చేసుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పార్టీని గ్రామస్థాయి నుంచి బలపర్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయన జిల్లా నేతలతో సమీక్షించారు.

Back to Top