<br/><br/>విజయనగరంః జననేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యక్తిత్వం, కష్టం ప్రతిబింబించేలా వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం రూపొందించిన ‘సాహోరే జగన్’ సీడీని వైయస్ జగన్ ఆవిష్కరించారు. ప్రజా సంకల్పయాత్రలో జరిగిన సంఘటలను కలిపి పాటరూపంలో సీడీగా తయారు చేయించినట్లు యువజన విభాగం తెలిపింది. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు పాదయాత్ర ఉద్దేశ్యం తెలిసే విధంగా సిడిని రూపొందించినట్లు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువచేస్తామన్నారు. త్వరలో సుమారుగా 10 సీడీలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.