పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా) : వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిలా ప్రతి కార్యకర్త పనిచేసి, సహకార సంఘాల ఎన్నికల్లో పార్టీ విజయభేరి మోగించేలా చేయాలని పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరెడ్డి ఆశయం మేరకు జగనన్న సారథ్యంలో రైతన్న రాజ్యాన్ని స్థాపించేందుకు పార్టీ శ్రేణులు కంకణబద్ధులు కావాలన్నారు. యలమంచిలి మండలం బూరుగుపల్లిలో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడం అంటే ప్రజలంతా ఓ గౌరవంగా భావిస్తున్నారని బాలరాజు అభివర్ణించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఏ పిలుపు ఇచ్చినా విజయవంతం చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న సహకార ఎన్నికల్లో పార్టీ విజయం సాధించి డిసిసిబి పీఠాన్ని అధిరోహిస్తుందన్న ధీమాను బాలరాజు వ్యక్తం చేశారు.
పార్టీ జిల్లా ఇన్‌చార్జి చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, నాయకులందరికీ రెండు అజెండాలు ఉంటాయని, అందులో ఒకటి పార్టీ గెలవాలని, రెండవది పార్టీ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి దక్కాలని కోరుకుంటారని అన్నారు. కార్యకర్తకు మాత్రం ఒకటే అజెండా ఉంటుందని, పార్టీని ఏ విధంగానైనా అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచనతోనే ఉంటాడని పేర్కొన్నారు. పదవిని అలంకార ప్రాయంగా కాకుండా బాధ్యతగా స్వీకరిస్తేనే వారికి, పార్టీకి గుర్తింపు వస్తుందన్నారు. అటువంటి వారినే శ్రీ జగన్మోహన్‌రెడ్డి అభిమానిస్తారని చెప్పారు.
ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలో యలమంచిలి మండలం ఆదర్శంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఏ పార్టీ అయినా బలోపేతం కావాలంటే ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఉండాలన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి వల్ల వైయస్‌ఆర్ సిపికి ఆ రెండూ ఉన్నాయన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామ జోగయ్య మాట్లాడుతూ 40, 50 మందితో గ్రామ కమిటీలు వేసి వారికి బాధ్యతలు అప్పగించడం ద్వారా గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టి పనిచేయించడం తనకు అలవాటన్నారు. జిల్లాలో పార్టీకి నేతృత్వం వహిస్తున్న యువ నాయకులంతా కష్టపడి పార్టీ అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. పార్టీ ఆవిర్భావం తరువాత తొలిసారిగా వస్తున్న సహకార ఎన్నికల్లో తమ పనితీరుని నిరూపించుకోవాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ, ప్రజల అండదండలు ఉన్నవాడే నిజమైన నాయకుడని, ఆ విషయాన్ని పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికే నిరూపించుకున్నారని అన్నారు. తన వంతుగా 30 సొసైటీలకు వైయస్‌ఆర్ సిపి నాయకులను అధ్యక్షులుగా గెలిపిస్తానని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ, రాష్ట్రానికి యువ నాయకత్వం అవసరమని, శ్రీ జగన్మోహన్‌రెడ్డి సిఎం అయితేనే తమ కష్టాలు తీరతాయని ప్రజలంతా భావిస్తున్నారని అన్నారు.
పార్టీ యలమంచిలి మండల కన్వీనర్ గుబ్బల వేణుగోపాలస్వామి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేవరపు మల్లేశ్వరరావు, నాయకులు ముచ్చర్ల శ్రీరామ్, గుణ్ణం నాగబాబు, గుబ్బల రామకృష్ణ, కావలి నాని, యడ్ల తాతాజీ, ఉచ్చుల స్టాలిన్, గుడాల సురేష్, కల్యా ణం గంగాధరరావు, ముచ్చర్ల చిన్న, పేరూరి జాన్ విల్సన్‌బాబు, జక్కంశెట్టి సుభాష్‌చంద్రబోస్, జల్లి నాగేశ్వరరావు, పీడీ రాజు, పాలంకి శ్రీను, పోలిశెట్టి శ్రీనివాస విజయ్‌కుమార్, గుమ్మాపు సూర్యవరప్రసాద్, గుడాల విజయ్ కుమార్, వైట్ల కిషోర్, వర్ధనపు పుల్లారావు, డేగల శ్రీను, కొండబాబు, భూపతిరాజు ప్రసాదరాజు, గంధం సత్యకీర్తి, నల్లా నాగరాజు నాయుడు, కొల్లు భాస్కరరావు, గుబ్బల సూర్యనారాయణ, బుంగా కుమారస్వామి, జక్కంశెట్టి భాగ్యలక్ష్మి, రామేశ్వరపు శాంతిస్వరూపిణి, కలిదిండి అన్నపూర్ణ, కాండ్రేగుల హేమలత పాల్గొన్నారు.