శాసన సభ్యత్వానికి రాజేష్ రాజీనామా

హైదరాబాద్:

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎమ్. రాజేష్ శాసన సభ్యత్వానికి గురువారం రాజీనామా సమర్పించారు. గురువారం ఉదయం ఆయన అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి వెళ్ళారు. స్పీకరు అందుబాటులో లేకపోవడంతో రాజేష్ తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో ఇచ్చారు. అక్టోబర్ నెలలో రాజేష్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల్రావుతో పాటు ఆయన విజయమ్మ సమక్షంలో పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే.

Back to Top