సాగు నీరు లేని 'మంత్రాలయం'

కంపాడు(మంత్రాలయం):

మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సో దరి అయిన వైయస్ షర్మిల పాదయాత్రలో భాగంగా మంత్రాలయం నియోజకవర్గం కంపాడులో పర్యటించారు. తమ గ్రామంలో ప్రజలు డెంగీ, గన్యా జ్వరాలతో బాధపడుతున్నారని ఆమె దృష్టికి తెచ్చారు. రోడ్లు లేవని తెలిపారు. వైయస్ హయాంలో మాకు రెండు పంటలకూ నీళ్ళొచ్చేవి. వైయస్ చనిపోయిన తర్వాత మూడేళ్ళుగా మంత్రాలయం నియోజకవర్గానికి నీళ్ళు లేవు. ఈ నీటిని కేంద్రమంత్రి కోడుమూరుకు తరలిస్తున్నారని ఆరోపించారు. మరో వంక త్వరలో తెలంగాణలో ప్రవేశించనున్న మరోప్రజాప్రస్థానం ఏర్పాట్లపై  హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృత సమావేశం ఏర్పాటైంది.

Back to Top