రైతుల భూముల‌పై పెద్ద‌ల క‌న్ను

విజ‌య‌న‌గ‌రం : భోగాపురం ఎయిర్ పోర్టు పేరు చెప్పి రైతుల నుంచి భూములు
లాక్కొనేందుకు పెద్ద‌ల ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అవుతున్నాయి. తొలి ఏకాద‌శి
మంచి రోజు అంటూ సాంప్ర‌దాయం కోసం భూముల స‌ర్వే చేస్తామంటూ అధికారులు
హ‌డావుడి చేశారు. గ్రామాల్లోకి వ‌చ్చి స‌ర్వే ప‌నుల్ని ప్రారంభించ బోయారు. ఈ
సంగ‌తి ప‌సిగ‌ట్టిన చుట్టు ప‌క్క‌ల గ్రామాల్లోని రైతులు పెద్ద ఎత్తున
అక్క‌డ‌కు చేరుకొన్నారు. స‌ర్వే ప‌నుల్ని అడ్డుకొన్నారు. మ్యాపుల్ని
చించివేశారు. భూముల్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇచ్చేది లేద‌ని స్ప‌ష్టం
చేశారు. స‌మాచారం అందుకొన్న పోలీసులు అక్క‌డకు చేరుకొని ప‌రిస్థితిని
స‌మీక్షించారు

Back to Top