రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన

జన్మభూమి కమిటీ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి
ఎమ్మెల్యే రక్షణనిధి
పల్లెర్లమూరి: చంద్రబాబు జన్మభూమి కమిటీ సభ్యుల పార్టీల వివక్షతతో గత 10 సంవత్సరాలుగా వస్తున్న పెన్షన్‌ను రద్దు చేశారని పలువురు లబ్దిదారులు ఎమ్మెల్యే రక్షణనిధికి తమ గోడు వెల్లబోసుకున్నారు. శనివారం మండలంలోని జీకొత్తూరు శివారు పల్లెర్లమూడి, చిక్కుళ్లగూడెం గ్రామాల్లో ఎమ్మెల్యే గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో ప్రజాబ్యాలెట్‌ ద్వారా చంద్రబాబు పాలనపై మార్కులు వేయించారు.  ఈ సందర్భంగా పలువురు పెన్షన్‌ లబ్దిదారులు ఎమ్మెల్యేకు తన గోడు వెల్లబోసుకున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా లేమన్న కారణంతో 15 మందికి పైగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులమన్న కనికరం కూడా పెన్షన్‌ తొలగించారని చెప్పారు. కొత్త పెన్షన్‌ మంజూరులో కూడా జన్మభూమి కమిటీ సభ్యులు వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో జన్మభూమి కమిటీల ఆకృత్యాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయని ధ్వజమెత్తారు. ఉన్నతాధికారులతో మాట్లాడి లబ్దిదారులకు న్యాయం జరిగేలా చూస్తానని వారికి భరోసా కల్పించారు. 



రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన
వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  
కారంపూడి:  రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన జరుగుతోందని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి దుర్మార్గ పాలనను చూడలేదని వైయస్‌ఆర్‌ సీపీ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. కారంపూడిలో మండల మైనార్టీ నాయకుడు షేక్‌ ఇమామ్‌సాహెబ్‌ నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వార్డు మెంబర్లుగా కూడా గెలవని వారిని పార్టీ ఇన్‌ఛార్జ్‌లుగా నియమించుకుని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్నచోట పక్కాగా ప్రోటోకాల్‌ను ఉల్లంఘింస్తూ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గ్రాంటులను కూడా ఇవ్వకుండా వారిని అవమానిస్తున్నారని మండి పడ్డారు.  దీనిపై సాక్షాత్తు  సీఎంకు ఫిర్యాదు చేసినా ఏమీ చేయలేని పరిస్ధితి దాపురించిందని ఇలాంటి అప్రజాస్వామిక విధానాలకు శ్రీకారం చుట్టిన ఘనత టీడీపీకే చెల్లుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో పార్టీలకతీతంగా పేదలందరికి సంక్షేమఫలాలు అందించి అందరి నోట నుండి దేవుడుగా కీర్తించబడితే,  పింఛన్ల దగ్గర నుండి అన్ని సంక్షేమ పధకాలు ఇవ్వడానికి ఒక్కోదానికి ఒక్కో రేటు నిర్ణయించి  దోపిడీకి పాల్పడుతున్న బాబు పాలన తీరు జుగుస్సాకరంగా వుందని విమర్శించారు. పార్టీ ఇన్‌ఛార్జ్‌లను పార్టీ కార్యక్రమాలకు పరిమితం చేయకుండా ఎమ్మెల్యేలు చేసే పనులను వారిచే చేయిస్తూ రాజ్యాంగ విరుద్ధ పాలన సాగిస్తున్నారని,  ప్రక్క రాష్ట్రం తెలంగాణాను చూసైనా ఇక్కడ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని అక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సంప్రదాయం ప్రకారం  నియోజకవర్గ ఫంఢ్స్‌ అందిస్తున్నారన్నారు. ఇలా ప్రతిపక్షాన్ని అణచి వేసే ప్రతి చర్యకు భవిష్యత్తులో వంత పాడుతున్న అందరూ సమాధానం చెప్పాల్సి వుంటుందని హెచ్చరించారు.  


రైల్వేజోన్‌ విశాఖవాసుల ఆకాంక్ష
విశాఖ: రైల్వే జోన్‌ విశాఖవాసుల ఆకాంక్ష అని  వైయస్‌ఆర్‌ కాంగ్రేస్‌ విద్యార్థి విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి బి.కాంతారావు అన్నారు. శనివారం ఉదయం ఏయూ మెయిన్‌గేట్‌ వద్ద ప్రత్యేక హోదా, రైల్వేజోన్, వెనుక బడిన ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక నిధులు అందించాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టారు. విద్యార్థులు చేపట్టిన ఒకరోజు దీక్షకు  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, తూర్పునియోజక వర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్రంతో పోరాటి హోదా సాధించాల్సిన ప్రభుత్వం లాలూచిపడి హోదా ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారన్నారు.విద్యార్థులు అనుకున్నది సాధిస్తారని, విద్యార్థుల ఉద్యమానికి తాము పూర్తి సంఘీభావం అందిస్తామన్నారు. ప్యాకేజీలకు ఆశపడి రాష్ట్ర ప్రజల అవసరాలను తాకట్టుపెడుతున్నారన్నారు. వైయస్‌ఆర్‌సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్మ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ రోజుకో అబద్దం చెబుతూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.చలోక్తులతో వెంకయ్యనాయుడు కాలం గడిపేస్తున్నారన్నారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడుల దుర్మార్గానికి రాష్ట్రం బలవుతోందన్నారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీఎమ్మెల్యే గొల్ల  బాబురావు మాట్లాడారు.   

విష వాయువులు వెదజల్లే పరిశ్రమలను  ఒప్పుకోం
మోపిదేవి వెంకటరమణ
నిజాంపట్నం: విషవాయువులు వెదజల్లే పరిశ్రమలు ఏర్పాటు చేస్తే సహించేది లేదని ప్రజలు తిరగబడేందుకు సిద్దంగా ఉన్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణారావు హెచ్చరించారు. నిజాంపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తీరప్రాంతంలోని దిండి సమీపంలో ఫార్మా కంపెనీనీ ఏర్పాటు చేసేందుకు అధికారపార్టీ పెద్దలు తెరవెనుక రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. 10 మందికి ఉపాధి కల్పించే ఏ కంపినీనైనా ఒప్పుకుని సహకరించేందుకు ప్రజలు సద్దంగా ఉన్నారు కానీ ప్రజల జీవితాలతో చెలగాటమాడే ఫార్మీకంపెనీనీ మాత్రం ఒప్పుకునే ప్రశక్తే లేదన్నారు.తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కొందరు ఫార్మాకంపెనీనీ ఏర్పాటు చేస్తామని వచ్చారని అయితే తాను వ్యతిరేకించి ప్రజలకు హాని కలిగించే కంపెనీలను ఏర్పాటు చేసే ప్రశక్తే లేదని తెగేసి చెప్పడంతో విరమించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం అధికారపార్టీకి చెందిన పెద్దనేతలు గుంటూరు,హైదరాబాదు కేంద్రంగా చేసుకుని తెరవెనుక రాజకీయాలు చేస్తున్నారని వాటిని బహిర్గతం చేయాలని తెలిపారు.ఫార్మాకంపెనీ ఏర్పాటు వల్ల ఎన్ని అనర్దాలు ఉన్నాయో ప్రస్తుం ఫార్మకంపెనీలు ఉన్నచోట జరుగుతున్న అనర్దాలను,ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూస్తున్నామని చెప్పారు.ఫార్మాకంపెనీ ఏర్పాటు వల్ల గుంటూరు,కృష్ణ జిల్లాల పరిదిలో ఉన్న కోస్టు మొత్తం కలుషితమై మత్స్యసంపదకు తీవ్ర ఇబ్బంది నెలకొనే అవకాశం ఉందన్నారు.అదేవిదంగా ఆక్వాసాగు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉటుందని చెప్పారు.అదేవిదంగా గ్రౌండ్‌ లెవల్‌లో నీరు కలుషితం, గాలి కలుషితమై ప్రజలు అనారోగ్యానికి గురైయ్యే ప్రమాదం ఉటుందని చెప్పారు.అధికార పార్టీ ముసుగులో ఉన్న పెద్దలు దిండిపరిశర ప్రాంతాల్లో బినామీ పేర్లుతో వందల ఎకరాల భూములను కొనుగోలు చేస్తూ భూ దందాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసేందుకు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.ప్రజలకు హానీ కలిగించే కంపెనీ ఏర్పాటుకు సహకరిస్తున్న ప్రతిఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.సమావేశంలో మండల ఎంపీటీసీ సభ్యుల ఫోరం అధ్యక్షుడు న్రరా సుబ్బయ్య, ఎంపీటీసీ సభ్యుడు నాజర్‌ఖాన్, రవి తదితరులున్నారు.


తాజా వీడియోలు

Back to Top