డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన

డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏపీఎస్ఆర్టీసి రీజనల్ మేనేజర్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు  ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రకటించింది.  అద్దె బస్సుల టెండర్స్ రద్దుచేయడం, పెండింగ్ లో ఉన్నకాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయడంతో పాటు  రిటైర్ అయిన ఆర్టీసి కార్మికులకు పీఆర్సీ బకాయిలు చెల్లించడం, సమైక్యాంధ్ర సమ్మెకాలం 60 రోజులను స్పెషల్ క్యాజువల్ లీవుగా మంజూరుచేయాలనే డిమాండ్ల అమలులో ప్రభుత్వం చూపుతున్న అలసత్వానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పద్మాకర్, పలిశెట్టి దామోదరరావు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top