న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకం

పట్నంబజారుః అవినీతి, అరాచకాలను అడ్రస్‌గా చేసుకుని... రాజ్యాంగాన్ని, చట్టాలను అపహాస్యం చేసే వారిని న్యాయపోరాటాల ద్వారా దీటుగా ఎదుర్కోవాలని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు న్యాయవాదులకు సూచించారు. శానసమండలి ప్రతిపక్ష నేతగా నియమితులైన ఉమ్మారెడ్డిని శుక్రవారం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు కృష్ణనగర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ప్రభుత్వ అలసత్వం, అవినీతిని అతికొద్ధి సమయంలోనే సోషల్‌ మీడియా ప్రపంచానికి తెలియజేస్తోందనే అక్కసులో దాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని విమర్శించారు. 

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర కీలకమని, ఏ ముఖ్యమంత్రి కూడా వ్యవహరించని రీతిలో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తామని వ్యాఖ్యలు చేయటం భాధాకరమన్నారు. రాజ్యాంగ విరుధ్ధంగా చంద్రబాబు సర్కార్‌ చేస్తున్న పనులను ప్రజలు ఉపేక్షించరన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలనకు న్యాయవాదులు అడ్డుకట్ట వేసి నానాటీకీ దిగజారి పోతున్న ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్నారు. వైయస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే వరకు న్యాయవాదులు అలుపెరుగని సైనికుల్లా పాటుపడాలని పిలుపునిచ్చారు. పార్టీ లీగల్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ పార్టీలో కార్యకర్తల కష్టాలను భుజాన వేసుకుని పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలనపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఉమ్మారెడ్డిని కలిసిన వారిలో వైయస్సార్‌సీపీ న్యాయవాదులు వాసం సూరిబాబు, పోకల వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, అనిల్, శ్రీరాముల, చిన్నపరెడ్డి తదితరులు ఉన్నారు.

Back to Top