గాల్లో చక్కర్లు కొట్టడం కాదు బాబు

()రుణాల మాఫీ లేదు, ఇన్ పుట్ సబ్సిడీ రూపాయి ఇవ్వలేదు
()పంటలు పరిశీలించకుండా విమానాల్లో తిరుగుతున్నాడు
()దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తోన్న వైయస్ జగన్
()రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్

గుంటూరుః రాష్ట్రంలో రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మండిపడ్డారు. భారీ వర్షాలతో పంటలన్నీ దెబ్బతిని రైతన్న దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే చంద్రబాబు విమానాల్లో చక్కర్లు కొట్టడం దారుణమన్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ముత్యాలంపాడులో వైయస్ జగన్ దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.  రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని వారికి భరోసానిచ్చారు. ఈసందర్భంగా ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే
()వర్షాల కారణంగా దాదాపుగా 3 లక్షల ఎకరాల్లో ప్రత్తి, వరి చేలతో పాటు ఒకటిన్నర లక్షలకు పైగా మిరప పంటలకు నష్టం వాటిల్లిన పరిస్థితి.
()ప్రత్తి  కౌలు రూ. 40 వేల నుంచి రూ.50 వేలు ఉంది. 20 వేల పైనే పెట్టుబడి పెట్టారు. మిరపకు సుమారు 50 వేలు పెట్టుబడి పెట్టామని రైతులు చెబుతున్నారు. ఏదీ చేతికందని పరిస్థితి. రైతులు ఇంత దారుణంగా బతుకుతుంటే...పంటలను నేరుగా పరిశీలించకుండా బాబు విమానాల్లో తిరుగుతున్నారు
()రైతుల దగ్గరకు పాలకులు గానీ, అధికారులు గానీ రాకపోవడం బాధాకరం. వ్యవసాయానికి  దమ్మిడి ఇవ్వడంలేదు.
()జూలై, ఆగష్టు చివరి వరకు వర్షాలు లేవు. చచ్చి చెడి కొద్దో గొప్పో పంటలను కాపాడుకునే పరిస్థితిలో వర్షాలు ముంచెత్తాయి. 
()గతేడాది ఇన్ పుట్ సబ్సిడీకి సంబంధించి రైతులకు రూపాయి ఇవ్వలేదు
()రాష్ట్రవ్యాప్తంగా రూ. వేయి కోట్లు ఉంటే అందులో రూ.120 కోట్లు ఒక్క గుంటూరు జిల్లాకే రావాలి. ఇంతవరకు రైతులకు రూపాయి కూడా ఇవ్వలేదు
()ఇన్ పుట్ సబ్సిడీ రాక, రుణాలు మాఫీ గాక, బ్యాంకుల్లో బంగారం ఇంటికి రాక రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు
()రుణాలివ్వొద్దంటూ బాబు బ్యాంకులకు ఆదేశాలివ్వడంతో పైసా వచ్చే పరిస్థితి లేదు. దీంతో, రైతులు దయనీయ పరిస్థితుల్లో బయట 2,3 రూపాయల వడ్డీకి రుణాలు తెచ్చుకొని అప్పుల చేసి మరీ పంటలు వేస్తే అవి కూడా చేతికందకుండా పోయాయి
()బాబు విమానాల్లో చక్కర్లు కొట్టడం కాదు. భూమి మీదకు వచ్చి రైతుల పంటలను పరిశీలించాలి. వారికి న్యాయం చేయాలని వైయస్ జగన్ డిమాండ్ చేశారు. 
 

Back to Top