ప్రభుత్వ దోపిడీ వల్లే

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ' ప్రభుత్వం అవినీతి, అన్యాయాలు, దోపిడీ వల్ల పంట విస్తీర్ణం తగ్గిపోయిందని ఫైరయ్యారు. వ్యవసాయ రంగం కుదేలైపోయింది. ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి వచ్చిన పాపాన పోలేదన్నారు. వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి బాగా పెరిగితేనే జీఎస్‌డీపీ పెరుగుతుంది. ఆ రెండు రంగాలూ కుంటుపడినా కూడా జీఎస్‌డీపీ పెరిగిందని ప్రభుత్వం చెప్పడం  పూర్తిగా అవాస్తవమన్నారు. ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి అవాస్తవాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు.

తాజా వీడియోలు

Back to Top