హైదరాబాద్: వైయస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణను ఎల్లుండికి వాయిదా వేశారు. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వ హోంశాఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ డీఐజీ, విశాఖ సీపీ, ఎయిర్ పోర్టు స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌ను చేర్చారు. కేసును ప్రభుత్వం, పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కేసును రాజకీయ కోణంలో దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. అధికార పార్టీకి లబ్ధి చేకూరేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏపీ డీజీపీ బాధ్యత లేకుండా వ్యవహరించారని చెప్పారు. <br/>