రిక్షాలు తొక్కుతూ వైయస్‌ఆర్‌ సిపి నిరసన

పిఠాపురం (తూర్పుగోదావరి జిల్లా), 25 సెప్టెంబర్‌ 2012: రాష్ట్రంలో బస్సు చార్జీలను ప్రభతుద్ం పెంచడంపై వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ నేతలు మంగళవారం పిఠాపురంలో రిక్షాలు తొక్కుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
స్థానిక వైయస్ఆర్ పార్టీ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం, కోటగుమ్మం సెంట‌ర్, ఉప్పాడ సెంట‌ర్ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు రిక్షాలు తొక్కుతూ నిరసన ప్రదర్శన చేశారు. ఉప్పాడ సెంటర్‌లో రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ప్రభుత్వం పెంచిన‌ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని వారంతా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం పార్టీ ఆందోళనకారులు ఆర్టీసీ బస్సుకు వినతిపత్రం అంటించారు.
Back to Top