బాబు స్వార్థం వల్లే ఈదుస్థితి

గుంటూరు:  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో నేల కుంగిన ఘటనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాజధానిలో మొన్న ఇళ్ళు కుంగాయి. నేడు తాత్కాలిక సచివాలయం ప్లోరింగ్ కుంగింది. నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రతిపక్షాలు ఈ భూమి రాజధానికి పనికిరాదు అని చెప్పినా స్వార్ధం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరి మాటలను పెడ చెవిన పెడుతున్నారని ఆర్కే మండిపడ్డారు. 

శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కనీసం బాబు చదివి ఉన్నా ఈ దుస్థితి వచ్చేది కాదన్నరు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి పంతాలకు పోకుండా శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను అమలు చేయాలి.' అని డిమాండ్ చేశారు. కాగా సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో మూడు అడుగులు వరకు నేల కుంగడంతో రెండు బ్లాకుల్లో ఫ్లోరింగ్ దెబ్బతింది. దీంతో అక్కడి పనిచేస్తున్న వారు ఆందోళనకు గురయ్యారు. 
లూజ్ సాయిల్ వల్లే నేల కుంగుతుందని నిపుణులు అంటున్నారుయ 
Back to Top