<br/><br/>చిత్తూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనా కాలంలోని స్వర్ణయుగం రావాలంటే ఆయన తనయుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ, వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ నగరి నియోజకవర్గంలోని పుత్తూరు మండలం కెబిఆర్ పురంలో రావాలి ఙగన్.. కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని వారికి నవరత్న పథకాల గురించి వివరించారు. ప్రతి ఇంటికి మంచి చేయాలి. ప్రతి రైతన్నకు తోడుగా నిలబడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న జగనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా తాము నిలబడతామని, చంద్రబాబు చేసే కుయుక్తులకు లొంగబోమని ప్రజ లు స్పష్టం చేస్తున్నారు. వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు తమ జీవితాల్లో వెలుగు నింపుతుందనే విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. <br/>