వైయస్ఆర్‌సీపీలోకి రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు

హైదరాబాద్:

రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మంగళవారం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పార్టీ కండువా వేసి రౌతును పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రౌతు సూర్యప్రకాశరావు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.

ఒక నిబద్ధత, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకత్వ లక్షణం ఉన్న శ్రీ జగన్ వల్లే సీమాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశ‌ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమాన్ని, అభివృద్ధిని ఒకేసారి అందించిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి‌ లాంటి సువర్ణ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని, అది శ్రీ వైయస్ జగ‌న్ వ‌ల్ల మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డితో తనకు 25 ఏళ్ల రాజకీయ అనుబంధం ఉందని రౌతు గుర్తుచేశారు. వైయస్ఆర్ వల్లే తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా గె‌లిచానని, అయితే వైయస్ఆర్‌సీపీలోకి రావడానికి కొంత ఆలస్యం జరిగిందని వివరించారు. రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం శ్రీ జగన్ నాయకత్వంలో పనిచేయాలని ని‌ర్ణయించి వైయస్ఆర్‌సీపీలో చేరినట్టు తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్న తాను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడం లేదని, వైయస్ఆర్‌సీపీ తరఫున పోటీ చేయనున్న బొమ్మన రాజ్‌కుమార్, ఆకుల వీర్రాజుల విజయానికి సహాయపడతానని చెప్పారు. రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి పోటీచేస్తున్న బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి విజయానికి కూడా కృషి చేస్తానన్నారు.

‌పార్టీలో విష్ణువర్ధన్, రాజవర్ధన్ చేరిక :
కర్నూలు జిల్లాకు చెందిన నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి మంగళవారం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరి వెంట వైయస్ఆర్ కాంగ్రె‌స్ శాసనసభా పక్ష ఉపనాయకురాలు భూమా శోభా‌ నాగిరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లి‌క్ సర్వీ‌స్ కమిష‌న్ సభ్యుడు డా‌క్టర్‌ నౌమా‌న్ కూడా శ్రీ వైయస్ జగ‌న్‌ను కలుసుకున్నారు.

Back to Top