రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ధ‌ర్నా


ప్రొద్దుటూరు: చేనేత కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆందోళ‌న చేప‌ట్టారు. ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న‌గా ఆయ‌న ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి పింఛన్ మంజూరు అయినా దాన్ని అధికారులు పంపిణీ చేయడం లేద‌ని ఎమ్మెల్యే మండిప‌డ్డారు. చేనేత కార్మికుల ఆందోళ‌న‌కు వైయ‌స్ఆర్‌  సీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు మద్దతు పలికారు. అధికారులు ఎంతకీ స్పందించకపోవడంతో ఎమ్మెల్యే వారికి మద్ధతుగా ధర్నాకు దిగారు. చేనేత కార్మికులకు పింఛన్ పంపిణీ చేసే వరకు తాను ధర్నా కొనసాగిస్తానని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
 


Back to Top