రాష్ట్రపతితో సాయంత్రం విజయమ్మ భేటి

హైదరాబాద్, 15 జనవరి 2013: 
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ మంగళవారం సాయంత్రం 6.15 గంటలకు ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో సమావేశం అవుతారు. వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా జైలు నిర్బంధించినందుకు నిరసనగా రాష్ట్రంలోను, దేశ, విదేశాల్లో సేకరించిన రెండు కోట్ల జనం సంతకాలను ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ రాష్ట్రపతికి అందజేస్తారు. శ్రీమతి విజయమ్మతో పాటు పార్టీకి చెందిన ఎంపి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రాష్ట్రపతిని కలుసుకుంటారు.

అంతకు ముందు మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎం.పి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం అవుతున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రాష్ట్రపతిని కలిసినప్పుడు ఏయే అంశాలను ప్రస్తావించాలని వారంతా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం వారంతా కలిసి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసేందుకు ఢిల్లీకి బయలుదేరి వెళతారు.


Back to Top