'రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన చంద్రబాబు'

కర్నూలు, 20 నవంబర్‌ 2012: రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు రోడ్డు పాలు చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మూలింటి మారెప్ప నిప్పులు చెరిగారు. ఆయన పాదయాత్రే ఒక బూటకమని మారెప్ప మండిపడ్డారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగాను, ఎనిమిదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు తన బాధ్యత మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధులు డబ్బులకు అమ్ముడుపోయారంటూ చంద్రబాబు మాట్లాడడం తగదని హితవు చెప్పారు. దిగజారిపోయి ఆయన మాట్లాడడం మంచిది కాదన్నారు.  షర్మిల 34వ రోజు పాదయాత్రలో పాల్గొన్న మారెప్ప మీడియాతో మాట్లాడారు. కాగా, మైనార్టీలకు మేలు చేసిన మహానేత వైయస్‌ను తాము ఎన్నటికీ మరిచిపోలేమని ఆ వర్గం నాయకులు తెలిపారు. ఫీజు రీయింబర్సుమెంట్‌ లాంటి ఎన్నో పథకాలు ప్రారంభించి రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కృషిచేసిన ఆయన తనయుడి వెంటే తామంతా ఉంటామన్నారు.

Back to Top