రాజన్నరాజ్యం కోసం కృషి చేద్దాం

అమరచింత:

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కలలుగన్న ఆశయాలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ ముందుకురావాలని మాజీ ఎమ్మెల్యే, వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు స్వర్ణమ్మ అన్నారు. ఆదివారం అమరచింతలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మక్తల్ నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించామని, ప్రస్తుతం షర్మిల చేపట్టిన పాదయాత్రకు ప్రతిఒక్కరూ మద్దతు పలకాలని కోరారు. మక్తల్ నియోజకవర్గంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని  బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగానే వర్కటం జగన్నాథ్‌రెడ్డి, రఘురాం విష్ణువర్థన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. సమావేశంలో స్వర్ణమ్మ కుమారుడు శ్రీధర్, వైయస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, నారాయణరెడ్డి, జుబేర్ అహ్మద్, మహేందర్, రంగనాథ్, జయరాములుతోపాటు పలువురు పాల్గొన్నారు.

Back to Top