వైయస్ఆర్ జిల్లా: జగన్ సోదరి షర్మిల పాదయాత్రకూ.. చంద్రబాబు పాదయాత్రకూ అసలు పోలికే లేదని నెల్లూరు జిల్లా ఉదయగిరి శాసన సభ్యుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన వైయస్ఆర్ జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. పోయిన ఇమేజ్ తెచ్చుకునేందుకు బాబు తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు రాజకీయ సన్యాసం తప్ప గత్యంతరం లేదని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. రామరాజ్యం, రాజన్న పాలన జగన్ ముఖ్యమంత్రి అయితేనే సాద్యమని మేకపాటి స్పష్టంచేశారు.