<strong>గుడివాడ (కృష్ణాజిల్లా), </strong>8 ఏప్రిల్ 2013: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, జననేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం 115వ రోజు మంగళవారం పాదయాత్ర సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. శ్రీమతి షర్మిల పాదయాత్ర మంగళవారం సాయంత్రం పుట్టగుంట నుంచి ప్రారంభం అవుతుందని పార్టీ కార్యక్రమాల కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, కృష్ణాజిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారంనాడు మొత్తం 7.2 కిలోమీటర్ల మేర కొనసాగే మరో ప్రజాప్రస్థానంలో శ్రీమతి షర్మిల పెదలింగాల, అరిపిరాల గ్రామాలలో పాదయాత్ర చేస్తారని వారు స్పష్టంచేశారు. రాత్రికి శ్రీమతి షర్మిల అరిపిరాలలో బసచేస్తారు.<br/>శ్రీమతి వైయస్ విజయమ్మ అమ్మమ్మ శ్రీమతి సోమమ్మ మృతి చెందడంతో పాదయాత్రకు సోమవారం ఒక రోజు విరామం ఇచ్చారు. కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని జొన్నపాడులో ఆదివారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన అనంతరం పాదయాత్రకు విరామం ఇచ్చి శ్రీమతి షర్మిల కడపకు బయలుదేరి వెళ్ళిన విషయం తెలిసిందే.