<strong>మహబూబ్‌నగర్, 22 నవంబర్ 2012:</strong> మరో ప్రజాప్రస్థానం పాదయాత్రగా వస్తున్న షర్మిలకు అఖండ స్వాగతం పలికేందుకు మహబూబ్‌నగర్ జిల్లా వాసులే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల రాష్ట్రవ్యాప్తంగా మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసింది. గురువారం మధ్యాహ్నానికి తుంగభద్ర వంతెన మీదుగా ఆమె పాదయాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలోని పుల్లూరు క్రాస్‌రోడ్డు వద్దకు చేరుతుంది. ఈ సందర్భంగా షర్మిలను సాదరంగా ఆహ్వానించేందుకు వేలాదిగా జనం తరలి వచ్చారు. పుల్లూరు క్రాస్‌రోడ్డు వద్ద షర్మిలకు స్వాగతం పలుకుతూ వేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతోంది.<br/><strong>షర్మిలను కలిసిన కొండా సురేఖ:</strong>వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండా సురేఖ గురువారం తుంగభద్ర వంతెన వద్ద షర్మిలను కలిశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో సురేఖ పాల్గొంటారు.