ప్రజాక్షేత్రంలో చంద్రబాబుకు శిక్ష తప్పదు..

టీడీపీ కుట్రలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు..
–విజయనగరం జిల్లా వైయస్‌ఆర్‌సీపీ నేతలు

విజయనగరంః చంద్రబాబుకు తన అవినీతిపై దాడులు చేస్తారన్న భయం పట్టుకుందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు విమర్శించారు. అందుకే రాష్ట్రంలోకి సీబీఐని రాకుండా జీవో తెచ్చారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలు బెల్లాని చంద్రశేఖర్‌ ,మజ్జి శ్రీనివాసరావులు మాట్లాడారు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో సంక్షేమమే లేదన్నారు.చంద్రబాబు చేస్తున్న కుట్రలకు ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదు..ప్రతిపక్ష నాయకుడిని తుదముట్టించి ప్రతిపక్షమే లేకుండా చేయాలని చంద్రబాబు అండ్‌ కో కుట్ర పన్నారని తెలిపారు.చంద్రబాబు అవినీతి,అరాచక పాలన ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెబుతారన్నారు.ధర్మపోరాటం చేసున్నాని చెప్పి వ్యవస్థలను నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. మారుమూల గ్రామాల ప్రజలు సైతం చంద్రబాబు కుట్రలను అర్థం చేసుకుంటున్నారన్నారు. వైయస్‌ఆర్‌ను పొగొట్టుకుని రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టుకున్నాం..అలాంటి పరిస్థితులు రాకుండా రాజన్న రాజ్యం తెచ్చుకోవడానికి రాష్ట్ర ప్రజలు రాజన్న బిడ్డ వైపు చూస్తున్నారన్నారు. మూడు వేల కిలోమీటర్లు, మూడు వందల రోజులను వైయస్‌ జగన్‌ విజయనగరం జిల్లాలో దాటడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

 
Attachments area
Back to Top