టీడీపీ కుట్రలపై ప్రజలకు అవగాహన

నెల్లూరుః కావలి లో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు కుట్రలపై మత్స్యకారుల గ్రామాల్లోని ప్రజలకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అవగాహన కల్పిస్తున్నారు. రష్యా వాళ్లు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేయడంతో  అక్కడి ప్రజలు తిరుగుబాటు చేశారు. వారు తరిమేస్తే దానిని నెల్లూరు - ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఉన్న కావలి సముద్ర తీరంలో ఏర్పాటు చేయడానికి  ప్రభుత్వం రహస్యంగా పనులు చక్కబెడుతోందని ఎమ్మెల్యే నిరసన గళం వినిపించారు.

 కావలి పరిసర ప్రాంతాల్లో, మత్స్యకారులు ఉన్న తీర ప్రాంతాల్లో, అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే  ప్రజలకు ఎంతటి భయానకమైన ముప్పు ఉంటుందో స్పష్టంగా ప్రజలకు వివరిస్తున్నారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా ప్లాంట్ ను అడ్డుకొని తీరుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top