<br/>న్యూఢిల్లీ) ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తలపెట్టిన మహా ధర్నా ఏర్పాట్లను ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ధర్నా కోసం జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ప్రత్యేక హోదా గురించి నోరు మెదపడం లేదని వెల్లడించారు. కనీసం పార్లమెంటులో కూడా టీడీపీ ఎంపీలు ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా కోసం ప్రశ్నించక పోవటం హాస్యాస్పదం అని అభిప్రాయ పడ్డారు.<br/>